సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సాంకేతి సమస్య కారణంగా రేవంత్ రెడ్డి ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర వరకు ఆలస్యమైంది. కాగా ఇదే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నారు.
కాగా ముంబైలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభకు సీఎం రేవంత్ హాజరుఅయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి బయలు దేరారు. అయితే రేవంత్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తెలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సమస్య తలెత్తడంతో ఇంజిన్ వేడెక్కింది. అది గమనించిన పైలట్ విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చాలా సేపటి వరకు ఎయిర్ పోర్టులో ఉండాల్సి వచ్చింది. దాదాపు గంటన్నర తర్వాత మరమ్మత్తులు చేయడంతో ఇండిగో విమానం ముంబై వెళ్లింది.
ఇది కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్ నంబర్లు ప్రతి పేజీపై రాయాల్సిందే.!
