తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోకసభ ఎన్నికల్లో ఆమో పోటీచేస్తున్నట్లు సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కాగా చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమిళి సై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలిమహిళగా చరిత్రలో నిలిచారు. ఆ తర్వాత పుదుచ్చేరి ఇంచార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఆమె చురుకుగా ఉన్నారు. బీజేపీలో కీలకంగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ..ఈ స్కీం గురించి తప్పక తెలుసుకోండి.!
The post Breaking : గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.! appeared first on tnewstelugu.com.
