హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టినప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై.. పలు చోట్ల వర్షం కురిసింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపురం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది.
నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్, మొజంజాహి మార్కెట్, కొండపూర్, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిన్నమొన్నటి వరకు ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరైన జనం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రిలాక్స్ అయ్యారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, కొమురం భీం, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: కోల్‌కతాలో భవనం కూలి ఏడుగురి మృతి
