Fake SI | ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ (Secunderabad)పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ (Secunderabad)పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఓ యువతి నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా చెబుతూ తిరుగుతున్నది. ఈ క్రమంలో పెళ్లి సంబంధం చూసేందుకు సదరు యువతి యూనిఫాంలోనే వెళ్లింది. అయితే అబ్బాయి తరఫున బంధువులు పై అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులుకు సమాచారం ఇవ్వండంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
