వంట చేయడం ఆలస్యమైందని..భార్యను అతికిరాతకంగా చంపాడో భర్త. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా థంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులను ప్రేమాదేవి (28), ఆమె భర్త పరస్రామ్ (30)గా గుర్తించినట్లు థాంగావ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ హనుమంత్ లాల్ తివారీ తెలిపారు.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..పనుల కోసం బయటకు వెళ్లిన పరశురాం ఇంటికి భోజనం పెట్టాలని భార్యను అడిగాడు. అయితే అప్పటికే భోజనం రెడీగా లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన పరశురాం పదునైన కత్తితో భార్యపై దాడి చేశాడు. అనంతరం తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకుని ఉరేసుకుని చనిపోయాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : సర్కార్ సొమ్ముకోసం కక్కుర్తి..అన్నాచెల్లెళ్లు ఏం చేశారో తెలుసా.?
