Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Kate Middleton | అవన్నీ అవాస్తవాలే.. విలియంతో అఫైర్‌ను ఖండించిన సారా రోజ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 19, 2024No Comments

Kate Middleton | బ్రిటన్‌ యువరాజు విలియం (Prince William)కు సారా రోజ్‌ హాండ్బరీ (Sarah Rose Hanbury)తో అఫైర్‌ ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను సారా తాజాగా ఖండించింది.

March 19, 2024 / 04:36 PM IST
Kate Middleton | అవన్నీ అవాస్తవాలే.. విలియంతో అఫైర్‌ను ఖండించిన సారా రోజ్‌

Kate Middleton | ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రిటన్‌ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ (Princess of Wales) కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆమె గత కొన్ని నెలలుగా బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడమే. అనారోగ్యం వల్ల కేట్‌ పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ వస్తున్నారు. దీంతో కేట్‌ చుట్టూ ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి.

శస్త్రచికిత్స అనంతరం కేట్‌ కోమాలోకి వెళ్లిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో యువరాజు విలియంకు స్నేహితురాలు 40 ఏళ్ల సారా రోజ్‌ హాండ్బరీ (Sarah Rose Hanbury)తో అఫైర్‌ ఉందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ‘కేట్‌ అదృశ్యంతో ఈ రాజ్యం అల్లకల్లోలమవుతోంది. కొందరు నెటిజన్లు ఇందుకు విలియం అఫైర్‌ కారణమని భావిస్తున్నారు’ అంటూ ఒక టాక్‌ షోలో కమెడియన్‌ స్టీఫెన్‌ కోల్బర్ట్‌ వ్యాఖ్యానించడంతో విలియం అఫైర్‌ స్టోరీ మరోసారి చర్చకు దారితీసింది. ఈ అంశం బ్రిటన్‌ రాజ్యంలో చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సారా రోజ్‌ హాండ్బరీ తాజాగా స్పందించింది. విలియంతో అఫైర్‌ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదించింది.

కాగా, సారా రోజ్‌ హాండ్బరీ బ్రిటన్‌ రాజవర్గాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో జన్మించింది. ఆమెకు విలియం, కేట్‌తో మంచి స్నేహం ఉంది. వారి నివాసాలు కూడా దాగ్గరగానే ఉంటాయి. దీంతో వీరు తరచూ కలుసుకుంటూ ఉంటారు. అయితే, సారా- విలియం మధ్య అఫైర్‌ ఉందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరి లవ్‌ అఫైర్‌పై తొలిసారిగా 2019లో వదంతులు వచ్చాయి. అప్పటి నుంచి ఈ వార్తలకు చెక్‌ పడటం లేదు. ఇప్పుడు కేట్‌ అదృశ్యం వేళ మరోసారి వీరి అఫైర్‌ అంశం తెరపైకి రావడంతో నెటిజన్లంతా కేట్‌ కనిపించకుండా పోవడానికి విలియం – సారా అఫైరే కారణం అంటూ చెప్పుకుంటున్నారు.

Also Read..

TCS Salary Hike | టీసీఎస్‌ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో జీతాలు పెంచనున్న సంస్థ..!

Indias First Bullet Train | బుల్లెట్‌ రైలుపై కీలక అప్‌డేట్‌.. 2026 నాటికి అందుబాటులోకి వస్తుందన్న రైల్వే మంత్రి

SS Rajamouli | జపాన్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. ప్రత్యేక గిఫ్ట్‌ ఇచ్చిన 83 ఏళ్ల వృద్ధురాలు

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.