
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ న్యాయమూర్తులను బదిలీ చేసింది?
1) ఆర్టికల్ 221 (1) 2) ఆర్టికల్ 222 (1)
3) ఆర్టికల్ 342 (1) 4) ఆర్టికల్ 322 (1)
జవాబు: 2
సరస్వతి సమ్మాన్-2023 పురస్కారానికి ఎవరిని ఎంపిక చేశారు?
1) నారాయణ దాసు 2) గుల్జార్
3) ప్రభా వర్మ 4) పై అందరికీ
జవాబు: 3
ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య?
1) 97.28 కోట్లు 2) 99.28 కోట్లు
3) 87.98 కోట్లు 4) 97. 88 కోట్లు
జవాబు: 1
దేశంలోని మొత్తం ఓటర్లలో ఉన్న పురుష, మహిళా ఓటర్ల సంఖ్య వరుసగా ఎంత? (కోట్లలో)
1) 47.1, 49.7 2) 47.9, 49.8
3) 49.7, 47.1 4) 48.7. 47.1
జవాబు: 3
పీచు మిఠాయిల్లో ప్రమాదకరమైన రంగులు గుర్తించడంతో ఇటీవల ఏ రాష్ట్రంలో వీటి విక్రయాన్ని నిషేధించారు. ఆ రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) హర్యానా 4) హిమాచల్‌ప్రదేశ్
జవాబు: 4
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లోకి మరో మూడు లక్షల మందిని తీసుకునే విస్తరణ ప్రతిపాదనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం దేశంలో 20 లక్షల మంది క్యాడెట్లు ఉన్నారు. ఎన్సీసీ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1956 2) 1948
3) 1947 4) 1950
జవాబు: 2
లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా నియమితులైన విశ్రాంత న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్
2) జస్టిస్ ఎన్వీ రమణ
3) జస్టిస్ రంజన్ గొగోయ్
4) పై ఎవరూ కాదు
జవాబు: 1
హైదరాబాద్ లాడ్‌బజార్‌లో ప్రసిద్ధ్ది చెందిన లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. ఇప్పటికే హైదరాబాద్ హలీమ్‌కు జీఐ ట్యాగ్ దక్కింది. లక్క గాజులతో కలిపి తెలంగాణలో ఎన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది?
1) 20 2) 17 3) 12 4) 16
జవాబు: 2
-సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ సౌజన్యంతో…
