spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు. దిర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజ్రాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
కాగా, గతంలో కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2023లో సంగ్రూర్‌లో నకిలీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదేవిధంగా 2020 ఆగస్టులో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో లూథియానాకు చెందిన ఓ దుకాణం తయారు చేసిన మద్యం తాగి కనీసం 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Varun Gandhi | లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్న వరుణ్ గాంధీ..?
Worlds Happiest Countries | ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలివే.. టాప్‌లో ఫిన్లాండ్.. భారత్ స్థానం ఎంతంటే..?
Tamilisai Soundararajan | ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్
