Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.
హైదరాబాద్ : సీఎం పదవిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti )కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతానని ప్రశ్నించారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారు.. సీఎం అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం((White paper) )విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ధరణకి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ లో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీ గా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
