Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). ఈ సినిమాలో జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). ఈ సినిమాలో జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి దేవర టీమ్ కొత్త ఫొటోను పంచుకుంది.
దేవర సినిమా షూటింగ్ విరామ సమయంలో దిగిన ఫొటోను దేవర టీమ్ ఎక్స్ వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్ నడుముపై చేతులో వేసుకొని ఠీవీగా కనిపిస్తుండగా.. అతడితో పాటు డైరెక్టర్ కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కనిపిస్తున్నారు. ఇక దేవర టీమ్ ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఒక పాట చిత్రీకరణలో భాగంగా టీమ్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
Making waves in Goa !! 🌊🎵 #Devara pic.twitter.com/EDnY5DApGk
— Devara (@DevaraMovie) March 22, 2024
మరోవైపు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆరోజే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.
