హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఇవాళ(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.
ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. అలాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పేపర్లలో తెలపలేదని కోర్టుకు తెలిపారు. వీటిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు..!
The post ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ appeared first on tnewstelugu.com.
