ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. 6 రోజుల కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులు హాజరుపరిచింది. కేజ్రీవాల్ మార్చి 28 వరకు రిమాండ్‌లో ఉంటారు. కేజ్రీవాల్ మద్దతుదారులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ ఈ దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని భారత కూటమిలోని సభ్యులను కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు అతన్ని రౌస్ అవెన్యూ కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించమని కోరింది. ఆ తర్వాత కేజ్రీవాల్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఈ క్రమంలో, రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు రిమాండ్ విధించింది.మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టులో వాదించింది. కేజ్రీవాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ కేసులో నిందితుడు విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పనిచేస్తున్నాడని పేర్కొంది. అలాగే కేజ్రీవాల్ వ్యాపారవేత్తల నుంచి డబ్బులు తీసుకుని సౌత్ లాబీ నుంచి డబ్బులు అడిగారు. ఈ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు కవితను ఈడి ఇప్పటికే అరెస్టు చేసింది.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు
