ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆపదలో అండగా ఉంటా. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతునవుతా.. ప్రజలు ఒక్క సారి ఆలోచన చేసి తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో నగర మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ సతీష్, నగర కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాను 2019లో ఎంపీగా ఓటమి చెందిన కూడా కరీంనగర్ లోనే నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని గుర్తు చేశారు. కానీ, బండి సంజయ్ ఎంపీ అయ్యాక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేడని చెప్పారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దమ్ము తనకు ఉందని చెప్పారు.
కానీ బండి సంజయ్ ఎంపీ అయ్యాక అభివృద్ధి కోసం నయాపైసా నిధులు తేలేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ట్రిబుల్ ఐటీతో పాటు పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.
ఇది కూడా చదవండి: త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు..!
The post ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతునవుతా appeared first on tnewstelugu.com.
