మనకు తెలియకుండానే మన వంటగదిలో ఆహార పదార్థాలతో సహా కొన్ని గృహోపకరణాలను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను ఆహ్వానిస్తున్నామన్న సంగతి మనకు తెలియదు. చాలామంది కిచెన్ రకరకాల పాత్రలను ఉంచుతుంటారు. వాటిలో ఆహార పదార్థాలు నింపి భద్రపరుస్తుంటారు. ఇంకొంతమంది అయితే కిచెన్ అందంగా కనిపించేందుకు రంగురంగుల డబ్బాలను ఉంచుతుంటారు. అయితే అవి మన సౌలభ్యం కోసమని భావిస్తుంటాం తప్పా…అందులో కొన్ని వస్తువులు క్యాన్సర్ కు కారణమవుతాయని మనకు తెలియకపోవచ్చు. ఇలా మన ఆరోగ్యాన్ని క్యాన్సర్ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. మనం వంటగదిలో ఎలా వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
నాన్-స్టిక్ వంట పాత్రలు:
ఈ మధ్య కాలంలో చాలా మంది వంటగదిలో నాన్న స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. నాన్ స్టిక్ అంటే స్టేటస్ కు సింబల్ గా భావిస్తుంటారు. ఏ వంట చేసినా పాత్రకు అంటుకోకుండా ఉంటుందని వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ నాన్ స్టిక్ పాత్రలు ఎంత డేంజరో మీకు తెలుసా. ఈ నాన్ స్టిక్ ను పెర్ప్పోరోక్టానోయిక్ యాసిడ్ అనే రసాయనంతో తయారు చేస్తారు. ఈ రసాయానికి క్యాన్సర్ కు దగ్గరి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ పొర సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ప్రమాదకరం కాదు. కానీ దాన్ని వేడి చేసినప్పుడు చిన్న మొత్తంలో అందులోని రసాయనం కరుగుతుంది. మీరు వంట చేస్తున్న సమయంలో ఆ రసాయనం పదార్థాల్లో కలిసిపోతుంది. ఈ ఫుడ్ తిన్నవారి లో ఫ్లూ వంటి లక్షణాలతోపాటు క్యాన్సర్ కు కారణం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ కంటైనర్లు:
నేడు ప్రపంచంలో ప్లాస్టిక్ లేని ప్రదేశం లేదు.వంటగది మినహాయింపు కాదు. BPA (BisphenolA (BPA), ప్లాస్టిక్‌ను తయారు చేయడానికి అవసరమైన ఒక రసాయనం ఈ కంటైనర్‌ల నుండి ఆహారంలోకి విడుదలవుతుంది. ఈ ఆహారాన్ని తీసుకున్న వ్యక్తులలో రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, ప్లాస్టిక్ కంటైనర్‌లను వేడి ఆహారాల కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు.
శుద్ధి చేసిన చక్కెర:
టీ, కాఫీలలో చక్కెరను ఉపయోగిస్తుంటారు. కానీ శుద్ధి చేసిన చక్కెర చాలా ప్రమాదకరం.తెల్ల చక్కెరను ఎక్కువగా తీసుకుంటే, మన శరీరంలో ఇప్పటికే ఉండే క్యాన్సర్-పీడిత కణాల సంఖ్య పెరుగుదలకు ఎక్కువ ప్రేరణ లభిస్తుంది. తద్వారా క్యాన్సర్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, బెల్లం లేదా ఇతర సహజ చక్కెరలను ఉపయోగించడం…లేదంటే స్వీట్ తీసుకోవడం తగ్గించడం మంచిది. పంచదారతో కూడిన టీ-కాఫీ తాగడానికి రుచిగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి ప్రమాదకరం.
ప్రాసెస్ చేసిన మాంసం:
నేడు మార్కెట్‌లో ప్రాసెస్ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. చెడిపోకుండా నిరోధించడానికి ప్రిజర్వేటివ్‌లు, ఇతర రసాయనాలు నైట్రేట్‌లను కలిగి ఉంటాయి.ఈ రసాయనాలు జీర్ణక్రియ సమయంలో నైట్రోసమైన్‌లుగా మారుతాయి. ఈ రసాయనం అది ఉన్న ప్రాంతంలో కణాల అవాంఛిత పెరుగుదలను ప్రేరేపిస్తుంది.ప్రాసెస్ చేసిన మాంసాల ద్వారా జీర్ణవ్యవస్థలో చేరిన ఈ రసాయనం తరచుగా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళంలో రూపాంతరం చెందుతుంది. ఇది ఈ భాగాల క్యాన్సర్లకు దారితీస్తుంది.సాధ్యమైనంత వరకు తాజా మాంసం తినడానికి ప్రయత్నించండి.
ఇది కూడా చదవండి: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కు క్యాన్సర్..!
