Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ram Charan | తిరుమల శ్రీవారి సేవలో రామ్‌ చరణ్‌ దంపతులు.. క్లీంకారా ఫేస్‌ రివీల్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 27, 2024No Comments

Ram Charan | టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan ) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చరణ్‌- ఉపాసన దంపతులు కలియుగ దైవం తిరుమల (Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

March 27, 2024 / 10:27 AM IST
Ram Charan | తిరుమల శ్రీవారి సేవలో రామ్‌ చరణ్‌ దంపతులు.. క్లీంకారా ఫేస్‌ రివీల్‌

Ram Charan | టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan ) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చరణ్‌- ఉపాసన దంపతులు కలియుగ దైవం తిరుమల (Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న చరణ్‌-ఉప్సీ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఎక్స్‌లో వైరలవుతున్న వీడియోల్లో క్లీంకారా ముఖం క్లియర్‌గా కనిపిస్తోంది. పాప జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకూ రివీల్ కానివ్వలేదు. తాజాగా మెగా ప్రిన్సెస్‌ ఫేస్‌ అనుకోకుండా రివీల్‌ కావడంతో అభిమానులు పాపను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్‌ మెగా ప్రిన్సెస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

Aweeeee ❤️😘🤌 baby kilnkara so cute 🥺#KlinKaaraKonidela #RamCharan #HBDRamCharan pic.twitter.com/gcwBmByEVo

— RRReddy (@RamRohitReddy) March 27, 2024

ప్రస్తుతం రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ (Game changer)లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్‌ (Shankar)‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా చరణ్‌ నటిస్తున్నారు. ఆర్‌సీ 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వ‌స్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందించ‌నుండ‌గా.. మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై వెంకటసతీశ్‌ కిలారు అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది.

Finishing the vows on a special day✨

Global Star @AlwaysRamCharan and @upasanakonidela were spotted offering prayers at #Tirumala on the occasion of the #Ramcharan’s birthday today 😍✨️#HBDRamcharan #MassmaRCh #RC16 #RC17 #GameChanger#GlobalStarRamCharan… pic.twitter.com/outJi6WuCR

— SivaCherry (@sivacherry9) March 27, 2024

Also Read..

Solar Storm | భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్‌.. భూ అయస్కాంత క్షేత్రంలో అవరోధాలు..!

Dhoni: 0.6 సెక‌న్ల‌లోనే స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్టిన ధోనీ.. వీడియో

Road accident | సూర్యాపేట జిల్లాలో దారుణం.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. తెల్లారేదాకా పైనుంచి వెళ్లిన వాహనాలు..!



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.