ACP transfer | జనగామ(Janagam) ఏసీపీ దామోదర్ రెడ్డి(ACP Damodar Reddy) పై బదిలీ వేటు పడింది.
జనగామ : జనగామ(Janagam) ఏసీపీ దామోదర్ రెడ్డి(ACP Damodar Reddy) పై బదిలీ వేటు పడింది. ఎన్నికల కోడ్(Election Code) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఏసీపీ దామోదర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న పెంబర్తి బైపాస్ రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వేటు పడింది.
