ఎంపీ కేశవరావుకు మతి బ్రమించినట్లుందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ బ్రతుకుల మీద విషం చిమ్ముతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహి పార్టి అని చెప్పులతో కొట్టారన్నారు. ఇవాశ(సోమవారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన రసమయి..మిలియన్ మార్చ్ లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలి. ఇవ్వాళ పాట లేదు.. మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారు. కేశవరావు భాష ఎవరికి అర్ధం కాదు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో తెలియదు… అలాంటి ఆమెకు మేయర్ పదవి ఇచ్చారు కేసీఆర్. పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరైంది కాదు కేశవరావు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేశవరావు ఏంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే కేశవరావు ఇంటి ముందు ధూంధాం నిర్వహిస్తామన్నారు.
10 ఏండ్లు ఆకలి భాధలు లేని తెలంగాణను చూశామన్నారు రసమయి బాలకిషన్. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టిలో సభ్యత్వం లేదు. ఆమె కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. కడియం శ్రీహరి ఏ బడి లో చదువుకున్నాడో, ఎక్కడ బడి చెప్పిండో ఎవరికి తెలియదు. తెలంగాణ ద్రోహి టీడీపీ నుండీ పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కడియందన్నారు. తెలంగాణ అభవృద్ధి కోసం బీఆర్ఎస్ లోకి వస్తా అంటే కేసీఆర్ ఆహ్వానించారు. కడియం శ్రీహరి మాదిగ ద్రోహి, మాదిగ జాతి అంటే కల్లమంట అని తెలిపారు. మాదిగ జాతిని మొత్తాన్ని నిర్వీర్యం చేసిన ఘనత కడియం శ్రీహరిదని విమర్శించారు. కడియం వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరీ రమేష్ వెళ్ళిపోయారని తెలిపారు రసమయి. మాదిగ జాతి ఎవరు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయోద్దని సూచించారు. అత్యధికంగా మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మనిషి చనిపోతే చావు డప్పు కొట్టే మాదిగలకు ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగ ద్రోహుల పార్టీ అని అన్నారు రసమయి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామని హెచ్చరించారు. వరంగల్ లో కడియం శ్రీహరి పై చావు డప్పు కొడుతామని తెలిపారు.
వందకు వంద శాతం కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని తెలిపారు రసమయి బాలకిషన్. కేసీఆర్ వెంటే మేము ఉంటాం. ముసలి నక్కలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయి. కడియం శ్రీహరి మాదిగలకు ద్రోహం చేశాడు కాబట్టి కచ్చితంగా శ్రీహరిని ఒడిస్తామన్నారు. ఓడగొట్టి పాతి పెట్టే వరకు రసమయి బాలకిషన్ కాలుకి గజ్జె కట్టి ఆడి పాడుతాడని తెలిపారు. మా పార్టి ఆదేశిస్తే నేను వరంగల్ నుండీ పోటీ చేస్తాను అని అన్నారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్లు కొసం తాపత్రయ పడుతోoదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారో మందకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: రైతాంగానికి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులు