ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్లిన ఏపీలోని బాపట్లకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తిచేసుకుని ఎంఎస్ చేసేందుకు గతేడాది డిసెంబర్ చివరిలో అమెరికాకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు. మాడిసన్ ప్రాంతంలో డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలకు హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో వాతావారణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగమంచు కమ్ముకుని కారు అదుపు తప్పింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతోపాటు రేవంత్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే చికిత్స పొందుతూ రేవంత్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని బంధువులు తెలిపారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదం నెలకొంది. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించింది. అతని తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 7గురు దుర్మరణం.!