మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ కంటోన్మెంట్ ఏరియాలో ఓ బట్టల దుకాణంలో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఊపిరిరాడక ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మ్రుతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మంటలు చెలరేగిన భవనం మూడంతస్తుల భవనమని చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పై అంతస్తులో నివసిస్తున్న కుటుంబం ఊపిరాడక మృతి చెందింది. ఈ విషయాన్ని ఛత్రపతి శంభాజీనగర్ పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా తెలిపారు.
తాజాగా నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 10కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ రసాయన కర్మాగారం నవీ ముంబైలోని MIDC ప్రాంతంలో ఉంది.ఈ ప్రమాదంలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
#WATCH | Maharashtra: A massive fire broke out in a clothing shop in the cantonment area of Chhatrapati Sambhajinagar, Aurangabad. Further details awaited. pic.twitter.com/Uokb80upnP
— ANI (@ANI) April 3, 2024
ఇది కూడా చదవండి: తైవాన్లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు..సునామీ హెచ్చరికలు జారీ.!