Kejriwal | అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 65 కేజీల బరువు వద్ద స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ నాలుగున్నర కేజీలు బరువు తగ్గారన్న ఆప్ మంత్రి అతిషి వ్యాఖ్యలను జైలు అధికారులు తోసిపుచ్చారు.
Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ 2లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు ఆప్ నేతలు పేర్కొన్నారు. ఈ అంశంపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 65 కేజీల బరువు వద్ద స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ నాలుగున్నర కేజీలు బరువు తగ్గారన్న ఆప్ మంత్రి అతిషి వ్యాఖ్యలను జైలు అధికారులు తోసిపుచ్చారు. అయితే కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న రోజున కేజ్రీవాల్ 69.5 కేజీల బరువు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, కానీ ప్రస్తుత రికార్డుల ప్రకారం ఈ 12 రోజుల్లో 4.5 కేజీల బరువు తగ్గినట్లు తమకు తెలిసిందని అతిషి పేర్కొన్నారు.
ఇక కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని జైలు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం పాడు చేస్తోందని, ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే.. ఎవర్నీవదిలిపెట్టమని అతిషి తేల్చిచెప్పారు.