Reckless Driver Flies in the Air | ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బీచ్‌లో ఎస్‌యూవీని నడిపాడు. ఆ తర్వాత దానిని పల్టీలు కొట్టించాడు. దీంతో ఆ వ్యక్తి ఆ కారు నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కువైట్ సిటీ: ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బీచ్‌లో ఎస్‌యూవీని నడిపాడు. ఆ తర్వాత దానిని పల్టీలు కొట్టించాడు. దీంతో ఆ వ్యక్తి ఆ కారు నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. (Reckless Driver Flies in the Air) అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కువైట్‌లో ఈ సంఘటన జరిగింది. అబు హసానియా పబ్లిక్ బీచ్‌లో జాయ్‌రైడ్ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. టయోటా ఎఫ్‌జె క్రూయిజర్‌ను నీటి అంచున నడిపాడు. కొంత సేపు నెమ్మదిగా డ్రైవ్ చేసిన 34 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి యాక్సిలరేటర్‌ను రైజ్ చేశాడు. కారును వేగంగా నీటిలోకి నడిపాడు. దీంతో అదుపుతప్పిన ఆ వాహనం పల్టీలు కొట్టింటి. బీచ్ తీరంలో బోల్తా పడింది.
కాగా, ఆ డ్రైవర్ కారు విండో నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. 16 అడుగుల ఎత్తు నుంచి నీటిలో పడ్డాడు. స్వల్పంగా గాయపడిన అతడు నీటి నుంచి బయటకు వచ్చాడు. సముద్రపు నీటిలో బోల్తా పడిన ఎస్‌యూవీని పోలీసులు బయటకు తీశారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.