Artificial Intelligence | ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.
హైదరాబాద్ : ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. గురు వారం హైదరాబాద్‌లో టెక్‌హబ్‌ను(TechHub) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జులైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామన్నారు. ఏఐ సిటీకి 200 ఎకరాలు కేటాయించామన్నారు. అలాగే స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ పరిశ్రమ అవసరాలు తీరుస్తామని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరించేలా చేయడమే తమ లక్ష్యం అన్నారు.
