నా పై కుట్రలు చేస్తున్నారు..ఫోన్ ట్యాపింగ్ లో కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జైలుకు పోతే పోతా.. కానీ పార్టీ మారనన్నారు.గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బలు పడ్డ.. జైలుకు పోయిన అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. పదవుల కోసం పార్టీలు మారినోడు.. 4 సార్లు చిత్తుచిత్తుగా ఒడిన కడియం శ్రీహరి నామీద విమర్శలు చేస్తున్నాడు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నా.. కడియం కావ్య చిత్తు చిత్తుగా ఓడిబోతోందన్నారు.
రైతు దీక్షలో బాగంగా మాట్లాడిన ఎర్రబెల్లి…ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. రైతులను ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..రైతులకు క్వింటాల్ కు బోనస్ అయిదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న ఎర్రబెల్లి..కాంగ్రెస్ ప్రభుత్వనిది అసమర్ధ పాలన అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు పరచాలన్నారు. ప్రభుత్వ పొరపాటు వల్లనే రైతుల పంటలు ఎండిపోయాయన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క గుంట కూడా నీళ్లు లేకుండా ఎండిపోలేదని తెలిపారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. రైతులను రాజుగా చేసిన పార్టీ, రైతు బీమా తో రైతులకు భరోసానిచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఇబ్బంది పడలేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం బీఆర్‌ఎస్ రైతుదీక్ష