తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి . ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి స్పందన లేదన్నారు. ఇవాళ( సోమవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
100 రోజుల కాంగ్రెస్ పాలనలో 2014 కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి దగుల్బాజి గాడు ..కేసీఆర్ లాగు ఇడిపిస్తా, బజారుకీడిస్తా అని అంటున్నాడు. ఇంకో మంత్రి ఏమో బీఆర్ఎస్ను వంద అడుగుల లోతులో బొంద పెడతా అంటున్నాడు. కేసీఆర్ను భయపెట్టే మొగోడు ఇంకా పుట్టలేదన్నారు. పరిపాలన చేతకాని రండలు కాంగ్రెస్ నేతలు..ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ వాళ్లను బొంద పెడతామన్నారు జగదీష్ రెడ్డి.
అధికారం కోసం అడ్డదారులు తొక్కే పార్టీ కాంగ్రెస్..కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ కు పొరపాటున ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజలకు ముఖం చూపలేక మంత్రి కోమటిరెడ్డి 15రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. జిల్లాలో మంత్రులు రైస్ మిల్లర్ల దగ్గర అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు చేరికలు, రాజకీయాలు తప్పా కాంగ్రెస్కు ఒక్క మంచి మాట రావడం లేదన్నారు. చేనేతల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనేని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు జగదీష్ రెడ్డి.
ఇది కూడా చదవండి: కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల ఖర్చు
The post కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవు appeared first on tnewstelugu.com.