Raj Thackeray | రాజ్ థాకరే (Raj Thackeray) నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది.

Raj Thackeray | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha polls) ముందు మహారాష్ట్ర (Maharashtra)లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ థాకరే (Raj Thackeray) నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే – శివసేన, అజిత్ పవార్ – ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికల్లో బేషరతుగా మద్దతు (unconditional support) ఇస్తున్నట్టు ప్రకటించింది. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద జరిగిన గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ఈ మేరకు ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు రాజ్ థాకరే పిలుపునిచ్చారు.
ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు
మరోవైపు మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఈ మేరకు కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.
Also Read..
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Lok Sabha Elections | ఓటేయాలంటూ తల్లిదండ్రులకు లక్ష పోస్టు కార్డులు
MLC Kavitha | మేడం జస్టిస్.. నిందితురాలిని కాదు బాధితురాలిని!