RR vs GT | టార్గెట్ చేధనకు దిగిన గుజరాత్ దూకుడుకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9వ ఓవర్‌లో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు.

RR vs GT | టార్గెట్ చేధనకు దిగిన గుజరాత్ దూకుడుకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9వ ఓవర్‌లో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (29), మాథ్యూ (2) ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 67/1.
ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో 3వేల పరుగులు పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో 3వేల పరుగులు సాధించాడు. గిల్ కంటే ముందు ఈ రికార్డు కోహ్లీ పేరుపై ఉండేది. విరాట్ కోహ్లీ మూడు వేల పరుగులు చేసినప్పుడు ఆయన వయసు 26 ఏండ్ల 186 రోజులు.