జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా విసృ్తత ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు.

- కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 10 : ప్రజాస్వామ్యంలో ఓటు హకు వినియోగం ప్రతి ఒకరి బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్స్ లో పోలీస్, పరిపాలన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులకు ఓటరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒకరూ తమ ఓటు హకును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.
సమాజంలో మార్పు ఓటు హకు ద్వారా సాధ్యపడుతుందని, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్, ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్ల ద్వారా ఓటరు జాబితాలో వివరాలు సరి చూసుకోవచ్చన్నారు. 18 సంవత్సరాల వయసు గల ప్రతి ఒకరూ ఈ నెల 15వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా విసృ్తత ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు, మండలాధికారి లోకేశ్వర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, డీఎస్పీ సదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులుపాల్గొన్నారు.
ఎండలపై జాగ్రత్తలను వివరించాలి
వేసవికాలం నేపథ్యంలో వడదెబ్బ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని అడ గ్రామంలో గల పీహెచ్‌సీని సందర్శించారు. వార్డులు, రిజిస్టర్లు, ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. సేవలలో ఏమైనా ఇబ్బంది ఉంటే వైద్యాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై పర్యవేక్షణ
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై యాప్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాగునీరు, మూత్రశాలలు, ఇతర వసతుల కల్పనపై రూపొందించిన బీఎల్వో యాప్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్లు, సెక్టార్ అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రత ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, దివ్యాంగ ఓటర్లను తరలించేందుకు వీల్ చైర్లు ఉంచాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దాసరి వేణు, దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ సదయ్య, ఆసిఫాబాద్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశపాండే పాల్గొన్నారు.