Sunny Leone: నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

న్యూఢిల్లీ: నటి సన్నీ లియోన్(Sunny Leone) తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దేవుడి ముందు ఒట్టు వేశామని, మంచి సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లోనూ కలిసి ఉండాలని ప్రామిస్ చేసినట్లు ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చింది. దేవుడు తమ కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించారని పేర్కొన్నది. చేతుల్లో చేయి వేసి ఈ దారిలోనే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. డానియల్ వెబర్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. వెబర్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెళ్లికి చెందిన వీడియోను పోస్టు చేశారు. సన్నీ లియోన్, డానియల్ వెబర్‌లు 2011లో పెళ్లి చేసుకున్నారు. కూతురు నిషాను వాళ్లు దత్తత తీసుకున్నారు. 2018లో నోహ, అషర్ పిల్లలు పుట్టారు. సరోగసీ ద్వారా ఆ పిల్లలు జన్మించారు.