Mahabubabad | గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన తల్లిదండ్రులు(Parents killed) ఉరి వేసుకుని ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డారు.

మహబూబాబాద్: గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన తల్లిదండ్రులు(Parents killed) ఉరి వేసుకుని ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడేనికి చెందిన పి.అనిల్(26), దేవి (22).. గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరి వేసుకున్నారు. స్థానికులు అందిం చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
గత నెల 10న తమ కుమార్తెలు లోహిత (2), జస్విత(1)కు పాలలో విషం కలిపి హత్య చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. పోలీసులు వీరిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అంకన్న గూడెం సమీపంలోని అడవిలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.