పండించిన పంటకు గిట్టుబాట ధర రాకపోవడంతో దురదృష్టకరమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా క్వింటాల్‌కు రూ.30 మాత్రమే పెంచారని విమర్శించారు. ఒకటింటికి ప్రకటించాల్సిన ధరను ఐదింటికి ప్రకటించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు అన్యాయం జరిగిందని అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు. వడ్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్కవ ధర ఇచ్చారని తెలిపారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జనగామలో 193 కొనుగోలు కేంద్రాలు పెట్టారని, అందులో ఒక్కటి కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు.
ఎన్నికల ముందు ధాన్యం క్వింటాకు రూ.2500లకు కొంటామని రేవంత్ రెడ్డి చెప్పారని, రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కనీస మద్దతు ధరకంటే రూ.700 తక్కువకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని మంత్రులు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయిందని చెప్పారు. రైతుబంధు, రుణమాఫీ ఇవ్వలేదు కాబట్టే రైతులు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, ధాన్యం క్వింటాకు రూ.2200 చెల్లించాలని, రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. బోనస్ పక్కన పెడితే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పల్లా.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి గింజా కొన్నామని, మద్దతు ధర ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల వేల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని విమర్శించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
పండిన పంటకు గిట్టుబాటు లేక రైతులు మోసపోతున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. ప్రభుత్వం నిద్ర మేల్కొనాలని.. రైతులతో రాజకీయాలు చేయొద్దన్నారు.
ఇది కూడా చదవండి: టూరిస్ట్ అభ్యర్థిని కాదు..స్థానిక సేవకుడిని
The post రాష్ట్ర వ్యాప్తంగా దళారుల దోపిడీ నడుస్తోంది appeared first on tnewstelugu.com.