రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది.
ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కాని, ఫైల్ కానీ లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే, ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనే అంశాన్ని ప్రభు త్వం పరిశీలిస్తున్నదని తెలిపింది.