లోక్‌సభ ఎన్నికల్లో గె లిచి మూడోసారి కూడా అధికారం చేపట్టాలనేది ఎన్డీఏ పట్టుదల. ఎలాగైనా మోదీని గద్దె దించాలనేది ఇండియా కూటమి కల.

- ఎన్నికల్లో కీలకంగా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్
- మొత్తం లోక్‌సభ స్థానాల్లో పావు వంతు ఈ రాష్ర్టాల నుంచే
- గత ఎన్నికల్లో మూడింటా ఎన్డీఏకు గణనీయ ఫలితాలు
- ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్న కమలదళం
- మోదీని గద్దె దించాలంటే ఇక్కడ నిలువరించాల్సిందే
- ఇండియా కూటమికి అసలు పరీక్ష ఈ మూడు రాష్ర్టాల్లోనే
- సర్వేల అంచనాలకు సైతం అందని ప్రజాభిప్రాయం
అమెరికాలో ఏడు స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. దేశాధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ర్టాలు డెమొక్రటిక్ పార్టీ వైపునో లేదంటే రిపబ్లికన్ పార్టీ వైపునో ఏకపక్షంగా మొగ్గుచూపుతూ ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ఈ రాష్ర్టాలే కీలకం. మన దేశంలోనూ లోక్‌సభ ఫలితాలను తారుమారు చేయగల మూడు స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. అవి. మహారాష్ట్ర, బీహార్,పశ్చిమబెంగాల్.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: లోక్‌సభ ఎన్నికల్లో గె లిచి మూడోసారి కూడా అధికారం చేపట్టాలనేది ఎన్డీఏ పట్టుదల. ఎలాగైనా మోదీని గద్దె దించాలనేది ఇండియా కూటమి కల. ఈ హో రాహోరీ పోరులో ఎవరి లక్ష్యం నెరవేరుతుం దో నిర్ణయించే కీలక రాష్ర్టాలు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. ఈ మూడు రాష్ర్టాల్లో 130 స్థానాలు ఉన్నాయి. అంటే, మొత్తం లో క్‌సభ స్థానాల్లో దాదాపు పావు వంతు స్థానా లు ఈ మూడు రాష్ర్టాలవే. ఈ మూడు రాష్ర్టా ల్లో కనుక ఎన్డీఏను నిలువరించగలిగితే మోదీ ని గద్దె దించే లక్ష్యాన్ని ఇండియా కూటమి స గం చేరుకున్నట్టే. ఈ రాష్ర్టాల్లో కనుక గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలను పునరావృతం చేస్తే మూడోసారి కూడా అధికారం చేపట్టేందు కు మోదీకి మార్గం సుగమం అయినట్టే. అం దుకే ఇరుపక్షాలూ ఈ మూడు రాష్ర్టాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రజాభిప్రాయం ఏంటో సర్వేలకు, రాజకీయ పండితుల అంచనాలకూ అందడం లేదు.
బెంగాల్‌లో ఇండియా కూటమి విచ్ఛిన్నం
42 సీట్లున్న పశ్చిమ బెంగాల్‌లో ఏడు విడత ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరి లో నిలవగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే, 2014 త ర్వాత బెంగాల్‌లో వేగంగా ఎదిగిన బీజేపీ.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓటుబ్యాంకును తనవైపు తిప్పుకున్నది. దీంతో మెజారిటీ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ – తృణమూల్ కాంగ్రెస్ మధ్య నే హోరాహోరీ పోరు సాగుతున్నదని సర్వేలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ తృణమూ ల్ కాంగ్రెస్ 22, బీజేపీ 18, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచాయి. ఇక్కడ సీట్ల పంపిణీ కుదరక ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడం బీ జేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. 2014 ఎ న్నికల్లో 17 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 20 19 ఎన్నికల నాటికి 40 శాతానికి పెరిగింది. ఈ ఓట్లను కనుక బీజేపీ కాపాడుకోగలిగితే ఆ పార్టీ మంచి స్థానాలను సాధించుకునే అవకా శముంది. అయితే, బీజేపీకి ఇక్కడ వ్యవస్థాపక బలం లేదు. పార్టీలో సువేందు అధికారి, దిలీ ప్ ఘోష్, సుకంత మజుందర్ నేతృత్వంలో మూడు వర్గాలు ఉండటం ఆ పార్టీకి మైనస్. ఇక, రాష్ట్రంలో దాదాపు 30 శాతం వరకు ఉ న్న మైనారిటీ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్‌కు ప్ర ధాన బలం. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేరుగా పోటీ చేస్తుండటంతో ఈ ఓట్లు చీలితే మాత్రం ఆ పార్టీకి మైనస్ కావచ్చు.
బీహార్‌లో ఈసారి ఎన్డీఏకు ‘సారీ’యేనా ?
గత రెండు ఎన్నికల్లోనూ ఎన్డీఏ వైపు నిలిచిన బీహార్‌లో ఈసారి గట్టి పోటీ నెలకొన్నది. 20 19 ఎన్నికల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఏకంగా 40 స్థానాలకు గానూ 39 స్థానాలను దక్కించుకుంది. తర్వాత కొంతకాలం నితీశ్ ఇండి యా కూటమితో కలిసి మళ్లీ ఎన్డీఏలోకి చేరిపోయారు. ఇలా కూటములు మార్చడం వల్ల ని తీశ్‌పై ప్రజల్లో విశ్వసనీయత తగ్గిందనే అంచనాలు ఉన్నాయి. నితీశ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీహార్‌లో ఎన్డీఏ ఓట్లను తగ్గించవచ్చు. అయితే, నితీశ్ కుమార్‌కు రాష్ట్రంలో 36 శాతం ఉన్న ఈబీసీ ఓటర్లలో బలం ఉండటం బీజేపీకి కలిసిరావ చ్చు. దళితుల్లో మంచి ఆదరణ ఉన్న చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రా మ్ విలాస్) కూడా కూటమిలో ఉండటం ఎన్డీఏకు మేలు చేయవచ్చు. మరోవైపు కమ్యూనిస్టులు కలిసి రావడం, ముస్లిం-బీసీ ఓటు బ్యాంకు ఇండియా కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక, బీహార్‌లో ఇండి యా కూటమికి ప్రధాన బలంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కనిపిస్తున్నారు. మొత్తంగా గత ఎన్నికల్లో లాగా ఈసారి బీహార్‌లో ఏకపక్ష ఫలితాలను సాధించడం ఎన్డీఏ కూటమికి అం త సులువు కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.
మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు ఎవరికో ?
దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నది మహారాష్ట్రలోనే. 2019 ఎన్నికల్లో ఇక్కడి 48 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 41 సీట్లు దక్కించుకుంది. అయితే, తర్వాతి కాలంలో వేగంగా పరిణామాలు మారాయి. శి వసేన ఎన్డీఏను వీడి కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టింది. తర్వాత శివసేనను ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చడం, వీరిద్దరూ బీ జేపీతో కలవడం వేగంగా జరిగిపోయాయి. ఇ ప్పుడు ఎన్డీఏలో బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిం డే), ఎన్సీపీ(అజిత్ పవార్) ఉన్నాయి. ఇండి యా కూటమిగా కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ ఠా క్రే), ఎన్సీపీ(శరద్ పవార్) కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి రెండు కూటముల మధ్య హోరీహోరీ పోటీ ఉన్నదని అన్ని సర్వేలు చెప్తున్నాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ.. మరిం త బలం పెంచుకునేందుకు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ను కలుపుకున్నది. దశాబ్దాలుగా మహారాష్ట్ర నేలపై ప్రభావం చూపిన శివసేన, ఎన్సీపీ చీలికకు కారణమనే అపప్రధ బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారవ చ్చు. మరాఠాలకు 10 శాతం కోటా కల్పిస్తూ షిండే ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో పడటంతో మరాఠాలను ఆకర్షించాలనుకున్న వ్యూహం ఫలించలేదు. మరోవైపు ఈ బిల్లు తమకు నష్టం చేస్తుందని భావిస్తున్న ఓబీసీలు కూడా వ్యతిరేకం అయ్యారు.