సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) వ్యవసాయ మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. రెండు రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరచుకోవడంతో ధాన్యం ట్రాక్టర్లు క్యూకట్టాయి.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) వ్యవసాయ మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. రెండు రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరచుకోవడంతో ధాన్యం ట్రాక్టర్లు క్యూకట్టాయి. ఒక్కసారిగా పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు మార్కెట్‌కు తరలిరావడంతో జనగాం-సూర్యాపేట రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటలుగా వాహనాలు కదలకపోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తిరుమలగిరి వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.