Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించాడు.

Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం, జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది.
Explore the remarkable odyssey of #Yatra2 👣, the story of a People’s Leader, now streaming exclusively on @PrimeVideoIN.
🔗 https://t.co/V4SFz2EZwm
Directed by @mahivraghav#LegacyLivesOn #Yatra2OnPrime @mammukka @JiivaOfficial @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar… pic.twitter.com/eqEI8PYF7a
— Jiiva (@JiivaOfficial) April 12, 2024