Sydney Mall: సిడ్నీలోని ఓ షాపింగ్ మాల్‌లో కత్తిపోట్లు, కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఆ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు ప్రాథమికంగా తేలింది. బోండీ జంక్షన్‌లో ఉన్న వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ అటాక్ జరిగింది.

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్(Sydney Mall)లో కత్తిపోట్ల దాడి జరిగింది. ఆ అటాక్‌లో నలుగురు మృతిచెందినట్లు సమాచారం ఉన్నది. సిడ్నీలోని బోండీ జంక్షన్ వెస్ట్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లతో పాటు కాల్పుల ఘటన కూడా జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. కత్తిపోట్లు, కాల్పులతో దద్దరిల్లిన ఆ మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో కాల్పులు శబ్ధం వినిపించినట్లు స్థానిక మీడియా చెప్పింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి భయానకంగానే ఉన్నది. మాల్‌కు వచ్చిన కస్టమర్లను తరలించారు. భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసుల వాహనాలు ఉన్నాయి.