Terrorists | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు 11 మందిని హతమార్చారు.

Terrorists | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు 11 మందిని హతమార్చారు. ముందుగా బాలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan province)లో క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును నోష్కి జిల్లాలో హైవేపై (Noshki highway) అడ్డుకున్నారు. అందులోని తొమ్మిది మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిని ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.
ప్రయాణికుల్ని కిడ్నాప్ చేయడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలను కనుగొన్నారు. మరోఘటనలో అదే హైవేపై వెళ్తున్న కారుపై దాడి చేసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు.
Also Read..
Massive Fire | కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇళ్లు
Indian Origin | డెలివరీ డ్రైవర్ దారుణ హత్య.. యూకేలో నలుగురు భారత సంతతి వ్యక్తులకు కఠిన కారాగార శిక్ష
Sonu Sood | షూ దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కి అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్