Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) నడిరోడ్డుపై కొందరు అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల (TMC workers)తో వాగ్వాదానికి దిగారు.

Adhir Ranjan Chowdhury | లోక్‌సభ ఎన్నికల వేళ (Lok Sabha Polls) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) నడిరోడ్డుపై కొందరు అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల (TMC workers)తో వాగ్వాదానికి దిగారు. ఆయన బెహ్రాంపూర్ (Behrampore)లో రోడ్డుపై టీఎంసీ కార్యకర్తలతో గొడవ పడుతున్న వీడియోను అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
పట్టపగలే ఈ కాంగ్రెస్ ఎంపీ (అధీర్ రంజన్ చౌదరిని ఉద్దేశిస్తూ) తమ పార్టీ కార్యకర్తను హింసాత్మకంగా నెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని పేర్కొంది. ఈ సిగ్గుచేటు పని అందరూ చూసేలా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డైనట్లు తెలిపింది. ఇది చాలా అవమానకరమని, బెహ్రాంపూర్‌కు ఇలాంటి నాయకత్వం అవసరమా..? అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, అధీర్ రంజన్ చౌదరి 1999 నుంచి బెహ్రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచీ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రచారం ముగించుకుని వెళ్తున్న సమయంలో కొందరు ‘గో బ్యాక్’ నినాదం చేయడంతో అధీర్ రంజన్ ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన టీఎంసీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
Seems like some things never change, huh? @adhirrcinc is clearly stuck in his hooligan past.
In broad daylight, this Congress MP was caught red-handed, violently pushing our party worker. And guess what? The CCTV footage has recorded this shameful act for all to see.
Is this… pic.twitter.com/dHdyNKaAUe
— All India Trinamool Congress (@AITCofficial) April 13, 2024
Also Read..
Bournvita | హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు
P Chidambaram | కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయి.. ఆ రెండు రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం : చిదంబరం
BJP Manifesto | బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఖరారు..!