Hockey Test Series : భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన టీమిండియా ఆఖరి పోరులోనూ చేతులెత్తేసింది.

Hockey Test Series : భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన టీమిండియా ఆఖరి పోరులోనూ చేతులెత్తేసింది. దాంతో, ఆతిథ్య ఆస్ట్రేలియా 5-0తో టెస్ట్ సిరీస్(Hockey Test Series) కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ జోరు చూపించిన ఆసీస్ 3-2తో గెలుపొందింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్యంలోని భారత జట్టు తొలి గోల్ కొట్టినా.. ఆ తర్వాత ఆస్ట్రేలియన్లు తమ సత్తా చూపించారు. దాంతో, ఓదార్పు విజయంతో సిరీస్‌ను ముగించాలనుకున్న టీమిండియా కల చెదిరింది.
Despite the outcome, our spirits remain unflinched. The results may not be in our favor this time, but our determination only grows stronger.
Team India’s spirit shines bright as we conclude our tour of Australia 2024
Australia 🇦🇺 3 – India 🇮🇳 2
Goal Scorers:
20′ Jeremy… pic.twitter.com/99ABZj8Q7I— Hockey India (@TheHockeyIndia) April 13, 2024
ఆట మొదలైన నాలుగో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. రాజ్ కుమార్ పాల్ సాధించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు. అయితే.. ఆ తర్వాత ఆస్ట్రేలియ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై దండెత్తారు. రెండో అర్థ భాగంలో ఏకంగా మూడు గోల్స్‌తో టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. 53వ నిమిషంలో బాబీ సింగ్ దామి గోల్ చేసినా అప్పటికే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. దాంతో, భారత జట్ట 0-5తో సిరీస్ కోల్పోయింది.