AIMIM to support AIADMK | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.

హైదరాబాద్: తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. (AIMIM to support AIADMK) ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బీజేపీతో పొత్తుకు అన్నాడీఎంకే నిరాకరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనని కట్టుబడి ఉంది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తామని కూడా హామీ ఇచ్చింది. అందువల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు ఏఐఎంఐఎం మద్దతిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది’ అని అందులో పేర్కొన్నారు.
AIADMK has refused to ally with BJP and has committed to never allying with it in the future. It has also assured that it will oppose CAA, NPR & NRC. Therefore, AIMIM extends its support to AIADMK in the coming Lok Sabha elections.
Our alliance will also continue for the Assembly…— Asaduddin Owaisi (@asadowaisi) April 13, 2024