ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదాపడింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదాపడింది. శనివారం రాత్రి విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో దాభాకొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా ఏపీ సీఎంపై దుండగులు రాయితో దాడిచేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు ‘వై’ ఆకారంలో కనుబొమ్మపైన శరీరం చిట్లిపోయింది. జగన్‌తోపాటు ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు. వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది జగన్‌కు ప్రథమ చికిత్స చేసి.. విజయవాడలోని జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కేసరపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా, ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. బస్సు స్సెక్యూరిటీలో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ ఖండిచారు. తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.