Lokesh Kanagaraj | ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఇప్పటికే లోకేశ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తలైవా 171 ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే.

Lokesh Kanagaraj | సినిమాలెన్ని చేశామన్నది కాదు.. హిట్టు కొట్టామా.. లేదా అన్నదే పాయింట్ అంటున్న స్టార్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తలైవా 171 ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే.
తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించి మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు. అయితే ఈ సారి మాత్రం సినిమాను డైరెక్ట్ చేయడం లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) హీరోగా BENZ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ కథనందిస్తుండటం విశేషం.
తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదట. లోకేశ్ కనగరాజ్ ఇప్పటికే కార్తీతో తెరకెక్కించిన ఖైదీలో కూడా హీరోయిన్ ఉండదని తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సారి కూడా లారెన్స్ సినిమాకు ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తూ హిట్టు కొట్టాలని చూస్తున్నాడేమోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
BENZ సినిమా వివరాలివే..
#BENZ – #LokeshKanagaraj mentioned this will be a Brutal and Gory Action Thriller which shows the journey of the Hero..💥 No Heroine in the film..😲
Starring: Raghava Lawrence
Story: LokeshKanagaraj
Direction: Bakkyaraj Kannan (Remo) pic.twitter.com/L6jnQt2Hxv— Laxmi Kanth (@iammoviebuff007) April 14, 2024