Dacoit Movie | అడివి శేష్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో ‘డెకాయిట్’ (Dacoit) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. షానీల్ డియో దర్శకుడు.
Dacoit Movie | టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh), శ్రుతిహాసన్ (Shruti Haasan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. ఈ ప్రాజెక్ట్ ద్వారా షనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చాడు హీరో అడివి శేష్.
ఈ సినిమా నుంచి అడివి శేష్ ఫస్ట్ లుక్ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. మీకు డెకాయిట్ చూపించడానికి వేచి ఉండలేను. షూటింగ్.. త్వరలో అని అడివి శేష్ రాసుకోచ్చాడు. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుండగా.. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే ఇందులో నటించే నటినటుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Can’t wait to show you #DACOIT ❤️🔥 Shoot…soon 🙂 https://t.co/FsASEpcPXH
— Adivi Sesh (@AdiviSesh) April 14, 2024