MI vs CSK : భారీ ఛేదనలో ముంబై ఇండయన్స్(Mumbai Iindians) కష్టాల్లో పడింది. యార్కర్ కింగ్ పథిరన వేసిన 8వ ఓవర్లో ఇషాన్ కిషన్ (23)ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
MI vs CSK : భారీ ఛేదనలో ముంబై ఇండయన్స్(Mumbai Iindians) కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. యార్కర్ కింగ్ పథిరన వేసిన 8వ ఓవర్లో ఇషాన్ కిషన్ (23)ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. సూర్య కొట్టిన బంతిని బౌండరీ వద్ద ముస్తాఫిజుర్ గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు.
🎥 It’s That Moment
OUT. OF. SIGHT 💥
Rohit Sharma deposits a 90m MAXIMUM into the crowd 💪
He has moved past FIFTY and looking in a brilliant touch! 👏 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ImRo45 | @mipaltan pic.twitter.com/LDnX4qedu1
— IndianPremierLeague (@IPL) April 14, 2024
బౌండరీ రోప్‌కు కాలు తగలకుండా ముస్తాఫిజుర్ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకొని బంతిని బయటకు విసిరేసి తాపీగా క్యాచ్‌ను పూర్తి చేశాడు. దాంతో, 70 రన్స్ వద్ద ముంబై రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత జడేజా ఓవర్లో బౌండరీతో రోహిత్ శర్మ(55), ఫిఫ్టీ సాధించాడు. తిలక్ వర్మ 12 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 90/2.