PM Modi | దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలన (NDA Rule)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. ఈ పదేళ్ల పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
PM Modi | దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలన (NDA Rule)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. ఈ పదేళ్ల పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. ఇంకా చేయాల్సింది ముందు ముందు చాలా ఉందన్నారు. సోమవారం కేరళ (Kerala) రాష్ట్రంలోని కున్నంకుళం (Kunnamkulam)లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. కేరళతోపాటు దేశ ప్రగతికి చేయాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘గత పదేళ్లలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. కేరళ సహా భారత్ కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉంది’ అని అన్నారు.
ఇక ఇదే సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండా ‘‘కాంగ్రెస్ యువరాజు’ తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు. యూపీలో తన కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడుకోలేక మౌనంగా ఉన్నారు (ఏళ్ల తరబడి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఉద్దేశిస్తూ). అయితే, కేరళ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తని ఆయన ఓట్లు మాత్రం అడుగుతాడు’ అంటూ రాహుల్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఈ ఎన్నికల్లోనూ బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని ఓటర్లను మోదీ అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు.
Also Read..
Lok Sabha polls | లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే.. తొలి విడతలో రికార్డు స్థాయిలో పట్టుబడిన నగదు
Rahul Gandhi | రాహుల్ గాంధీ హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసిన అధికారులు
Byjus | ఆరు నెలలకే సీఈవో రాజీనామా.. రవీంద్రన్‌కు బైజూస్ ఇండియా బాధ్యతలు