Huma Qureshi | బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) ఇటీవలే Maharani 3 వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భామ తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Huma Qureshi | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi). ఈ సీనియర్ నటి ఇటీవలే Maharani 3 వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హుమా ఖురేషి నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ భామ తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సోషల్ మీడియా ఖాతా ద్వారా కొత్త సినిమాను ప్రకటించింది. హుమాఖురేషి లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా గులాబి (Gulabi). విపుల్ మెహతా ఈ మూవీ షూటింగ్ ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షురూ అయింది. జియో స్టూడియోస్, Echelon Productions (విశాల్ రానా) సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. హుమా ఖురేషి Pooja Meri Jaanలో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుంది.
గులాబి షూటింగ్ షురూ..
HUMA QURESHI – JIO STUDIOS – VISHAL RANA FILM TITLED ‘GULABI’… SHOOT BEGINS TODAY… Announced on #InternationalWomensDay, #JioStudios and producer #VishalRana’s [Echelon Productions] new film, starring #HumaQureshi, is titled #Gulabi.
Filming commences in #Ahmedabad today.… pic.twitter.com/02L1SzM9Do
— taran adarsh (@taran_adarsh) April 15, 2024