టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేయనుందని చెబుతున్నారు. వనిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్లను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.
Google Pixel 9 smartphones : టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేయనుందని చెబుతున్నారు. వనిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్లను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ లైనప్‌తో పాటు ఎక్స్ఎల్ సైజ్ తిరిగి రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగో మోడల్‌ను కూడా గూగుల్ లాంఛ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పిక్సెల్ 9 ప్రొ ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ మోడల్ కూడా ఈ సిరీస్‌లో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌కు కోమెట్ అని కోడ్‌నేమ్ ఇచ్చారని అండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ పేర్కొంది. గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను పిక్సెల్ 9 సిరీస్‌లో భాగంగా లాంఛ్ చేస్తుందా లేక విభిన్న పేరుతో కస్టమర్ల ముందుకు తీసుకువస్తుందా అనే ఉత్కంఠ టెక్ వర్గాల్లో నెలకొంది.
ఇక అనధికార లీక్‌ల ప్రకారం పిక్సెల్ 9 రౌండెడ్ కెమెరాలు, ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుందని చెబుతున్నారు. ఇక కెమెరా లవర్స్‌కు గుడ్ న్యూస్ అందిస్తూ పిక్సెల్ 9 టెలిఫొటో లెన్స్‌తో ఆకట్టుకోనుంది. కెమెరా సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు గూగుల్ ఏఐని వాడటంపై ఫోకస్ పెంచింది. ఈ ఏడాది మే 14న జరిగే గూగుల్ I/O ఈవెంట్ వేదికగా పిక్సెల్ 9కు సంబంధించిన వివరాలను టెక్ దిగ్గజం ప్రకటించే అవకాశం ఉంది.
Read More :
Salman Khan | సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్