ఈనెల 18వ తేదీన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందిస్తారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియామవళిని అనుసరించి 95లక్షల రూపాయల చెక్కులను కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకుంటారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుదీర్ఘ సమీక్షలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీఎంపీలు, ఎమ్మెల్యేలు,పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీచేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయామని చింతిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ అధినాయకత్వాన్ని తిరిగి కోరకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నదని బీఆర్ఎస్ భావిస్తోంది. తమ హక్కులు కాపాడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నట్లు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే అధినేత కేసీఆర్ ప్రచార సరళిని కూడా రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరింత చేరువవ్వాలనే అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం దగ్గరకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసాకల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18న బస్సు యాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి : కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు..!