హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా చలి విజృంభిస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి అటవీశాఖ పరిధిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.5 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 8.8, ఆదిలాబాద్‌లో 9.7, నిర్మల్‌లో 10.3, మంచిర్యాలలో 10.5, సిద్దిపేట జిల్లా హబ్సీపూర్‌లో 10, మెదక్ జిల్లా టేక్మాల్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీహెచ్‌ఎంసీ శివారు ప్రాంతాలు చల్లగా ఉన్నాయి. ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
861843