మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తోంది. పూణేలోని బవ్ధాన్ ప్రాంతంలో నివసిస్తున్న 67 ఏళ్ల వ్యక్తికి జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత ఏడాది అక్టోబర్ 22న నాసిక్ నుంచి సూరత్ వెళ్లాడు. గత నెల 6న సూరత్ నుంచి పూణె చేరుకున్నాడు. అదే సమయంలో వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు.
వైద్యులు అతడి నుంచి శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం పూణెలోని వైరాలజీ ల్యాబొరేటరీకి పంపించారు. గత నెల 30వ తేదీన పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గ్రోత్‌లో జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారించింది. అయితే ప్రస్తుతం ఆ వృద్ధుడి ఆరోగ్యం బాగానే ఉందని మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
