హైదరాబాద్: తనపై పెట్టిన అక్రమ ఈడీ కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ సభ్యుడు నామా నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను కూడా కొట్టివేయాలని కోరారు.
2009లో మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు రాజీనామా చేసిన ఎంపీ నామా.. రాంచీ హైవే కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
సీబీఐ ఎఫ్ఐఆర్, చార్జిషీటులో తన పేరు లేదని నామా పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.